తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఇదో చరిత్రాత్మక ఘట్టమని ఈ కులగణన సర్వే దేశానికి ఆదర్శమన్నారు. దేశంలో తొలిసారి తెలంగాణలో కులగణన చేసి కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల జనాభా లెక్క తేలిందన్నారు.