కామారెడ్డి పరిధిలోని రంగంపేటకి చెందిన మున్సిపల్ కార్మికుడు పాసుల రేవన్ విధులు నిర్వహించుకుని వెళ్తుండగా ఆక్సిడెంట్ కావడం వల్ల చనిపోయాడు. వెంటనే ఆ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా ప్రభుత్వ ఆసుపత్రి వెళ్లి మృతి పట్ల సంతాపం తెలియజేసారు. 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎస్సై నగేష్, యూనియన్ లీడర్ ప్రభువు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.