కామారెడ్డి: కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ సీఐటీయూ నిరసన

71చూసినవారు
కామారెడ్డి: కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ సీఐటీయూ నిరసన
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మికులకు, కర్షకులకు, ప్రజలకు వ్యతిరేకంగా సంపన్న వర్గాలకు మేలు చేసే విధంగా ఉందని సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కామరెడ్డి ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాబోయే కాలంలో కార్మిక వర్గం కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఊడిగం చేసే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్