రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ ఎత్తివేసే కుట్ర చేస్తుందని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలను 5వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించకుండా ఎత్తివేసే కుట్ర చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.