కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట్ తాండ గ్రామానికి చెందిన మైనర్ బాలిక 17 సంవత్సరాలు ఇంట్లో తన తల్లి మందలించిందని ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని తల్లి సునీత శుక్రవారం తెలిపారు. తల్లి సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఎవరికైనా ఈ అమ్మాయి ఆచూకీ తెలిస్తే వెంటనే తెలియజేయాలని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు.