కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు నిట్టు లింగారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం లింగారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.