పాకిస్థాన్ పై పోరులో కామారెడ్డి జిల్లా జవాన్

52చూసినవారు
పాకిస్థాన్ పై పోరులో కామారెడ్డి జిల్లా జవాన్
పాకిస్థాన్ తో జరుగుతున్న భీకర పోరులో కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బాగిర్తి పల్లికి చెందిన జవాన్ విజయ్ కుమార్ వున్నారని జవాన్ కుటుంబ సభ్యులు తెలిపారు. విజయ్ కుమార్ పాకిస్థాన్ పై యుద్ధం చేయడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న విజయ్ కుమార్ ను యువత ఆదర్శంగా తీసుకోని, యువకులు మిలిటరిలో చేరాలంటున్నారు గ్రామస్తులు.

సంబంధిత పోస్ట్