కామారెడ్డి: శ్రీ కల్కి మానవసేవ సమితి నిర్వాహకులు ఎర్రం చంద్రశేఖర్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అంతే కాకుండా పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం, ప్రతి మంగళవారం కల్కి ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తూ, కోటి మందికి అన్న ప్రసాదం చేరే విధంగా ప్రయత్నిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. వారికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) రాష్ట్రస్థాయి ఉత్తమ సామాజిక సేవా పురస్కారాన్ని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు బుధవారం అందజేసారు.