కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి 35వ వార్డులో ఉచిత వాటర్ ట్యాంకర్ ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు కొబ్బరికాయ కొట్టి శనివారం ప్రారంభించారు. వార్డులో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని 35వ వార్డు బీజేపీ ఇంచార్జి రాజుపాటిల్ దృష్టికి కాలనీ ప్రజలు తీసుకురాగా వాటర్ ట్యాంకర్ ను ఏర్పాటు చేశారు. అడగగానే ట్యాంకర్ ను ఏర్పాటు చేయడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.