కామారెడ్డి: ఫిషరీస్ విద్యార్థుల కొరకు కరదీపిక ఆవిష్కరణ

63చూసినవారు
కామారెడ్డి: ఫిషరీస్ విద్యార్థుల కొరకు కరదీపిక ఆవిష్కరణ
కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో జువాలజీ, ఫిషరీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు తేలికగా, సులభంగా అర్థమయ్యే రీతిలో కరదీపిక రూపొందించి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ కరదీపిక విద్యార్థులకు, అధ్యాపకులకు పరిశోధక విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్