కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ దగ్గి అడవి ప్రాంతంలో జాతీయ రహదారిని దాటుతున్న చిరుతను కారు ఢీకొని చిరుత గాయపడింది. కామారెడ్డి రిజర్వు అడవి ప్రాంతంలో కల్వరాల్ బీట్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో గాయపడిన చిరుత చనిపోయిందా లేదా అనేది తెలియ రాలేదు. అడవి అధికారులు మాత్రం చిరుతకు ప్రమాదం జరిగిన విషయం వాస్తవమని తెలిపారు.