మహానేత, సామాజిక సంక్షేమవాది జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం వేడుకలు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే సేవలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిదాయకమైన జీవితమే ఈనాటి సమాజానికి మార్గదర్శిగా నిలుస్తుంది అంటూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.