కామారెడ్డి జిల్లా క్రీడా సంఘం ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సభ్యులు ఓట్లు వేశారు. అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించగా జిల్లా క్రీడా విభాగం అధ్యక్షునిగా గడ్కోల్ లక్ష్మీనర్సాగౌడ్ గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా రామచంద్రనాయక్, కోశాధికారిగా రాజలింగం ఎన్నికైనట్లు ఆదివారం ఎన్నికల అధికారులు వెల్లడించారు.