కామారెడ్డి: వర్షానికి గుంతగా మారిన ప్రధాన రహదారి

63చూసినవారు
కామారెడ్డి: వర్షానికి గుంతగా మారిన ప్రధాన రహదారి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. రహదారిపై గుంతలు ఉండడంతో వర్షపు నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఏర్పడ్డ గుంతలతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితిలో వాహనదారులు ఉన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బీటీ రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్