కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ చాముండేశ్వరి దేవాలయంలో శ్రీ సంకష్టహర గణపతి 9వ వార్షికోత్సవము పురస్కరించుకొని మంగళవారం సాముహిక గణపతి హోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి విశేష అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్, ధర్మకర్తలు, దేవాలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.