కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ మానవత్వం చాటుకున్నారు. ఉగ్రవాయి శివారులోని భవానిపేట్ స్టేజి వద్ద లింగం అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఆదివారం ఢీకొట్టింది. కాగా అటువైపుగా వెళ్తున్న చైర్‌పర్సన్ తన కారును ఆపి అంబులెన్సుకు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.