కామారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన జ్యోతీరావు గోవిందరావ్ పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్ 11న జన్మించాడన్నారు.