కార్మిక కర్షక లోకానికి అండగా నిలబడి తన రచనలతో సమాజంలో మార్పులు తెచ్చిన మహాకవి శ్రీశ్రీ రచనలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ అన్నారు. ఆదివారం కామారెడ్డిలోని కర్షక బిఈడి కళాశాలలో శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.