కామారెడ్డి: 46% బీసీ రిజర్వేషన్ కల్పించడం అభినందనీయం

55చూసినవారు
కామారెడ్డి: 46% బీసీ రిజర్వేషన్ కల్పించడం అభినందనీయం
భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో శనివారం గ్రామ బీసీ సంఘ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘ సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను గుర్తించి 46% రిజర్వేషన్ కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీసీ సంఘ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్