కామారెడ్డి: పీఎస్ కు వచ్చే ఫిర్యాదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి: ఎస్పీ

66చూసినవారు
కామారెడ్డి: పీఎస్ కు వచ్చే ఫిర్యాదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి: ఎస్పీ
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, తాడ్వాయి పోలీస్ స్టేషన్ల ను శనివారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా జిల్లా ఎస్పీకి పూల మొక్క అందజేసి ఎల్లారెడ్డి డీఎస్పీ, సీఐ, ఎస్సైలు స్వాగతం పలికారు. ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదుదారులతో ప్రవర్తించవలసిన తీరును సిబ్బందితో మాట్లాడి వివరించారు.

సంబంధిత పోస్ట్