కామారెడ్డి జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సన్నపల్లి పాఠశాలలో ఆదివారం ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. తదనంతరం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సభాధ్యక్షులుగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేరీ వరదానం వ్యవహరించారు. ప్రార్థనగీతం అనంతరం విద్యార్థినిలచే ప్రత్యేక గౌరవ వందనం స్వీకరించారు. పలువురు నేతలు స్వామి, శ్రీధర్ బాలయ్య పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని ప్రశంసించారు.