కామారెడ్డి పట్టణంలోని లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో శనివారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిథిగా పున్న అరుణ హాజరై పిల్లలందరికీ భోగి పండ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలోని బాలికలు వేసినటువంటి ముగ్గులతో ప్రాంగణమంతా రంగులమయమైంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.