సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సన్నపల్లిలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ఆడబిడ్డలకు విద్యాప్రదాతగా, మహిళా చైతన్య మూర్తిగా, స్త్రీల హక్కులకై పోరాడిన ఆదర్శమూర్తిగా, సామాజిక రుగ్మతలపై, సాంఘిక దురాచారాల నిర్మూలనకు పోరాడిన ధీరవనిత అని కొనియాడారు.