కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు టెక్రియల్ గ్రామంలో గల డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద సెప్టిక్ ట్యాంక్ లీకేజీ అవడంతో కాలనీవాసులు చాలా ఇబ్బంది గురవుతున్నారు. విపరీతమైన దుర్వాసన, దోమలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ దోమల వల్ల ఇప్పటికే డెంగ్యూ వ్యాధితో చనిపోయారని కాలనీవాసులు ఆదివారం తెలిపారు. సెప్టిక్ ట్యాంక్ లీకేజీ అవ్వడం వల్ల మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.