పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత కూడా చల్లటి గాలులు వీస్తున్నాయి. అలా ఉండగా సూర్యభగవానుడు కూడా ఉదయం 10 గంటలు దాటే వరకు జాడ లేదు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల్లో గత పది రోజులుగా సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.