కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ లో గల శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవానుల కళ్యాణ మహోత్సవాన్ని ప్రణయ దాసాజీ గారి ఆధ్వర్యంలో సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణపతి పూజ, గౌరీ పూజ, పాదుక పూజా కార్యక్రమం, అమ్మ భగవాన్ కల్యాణ మహోత్సవాన్ని భక్తుల కోలాహలం మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవకులు చంద్రశేఖర్, విజయ్, డాక్టర్ బాలు, సూర్యకాంతం, దిగంబర్, శ్రావణి, జ్యోతి, స్వరూపలు పాల్గొన్నారు.