ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన గుణాత్మక విద్య అందిస్తున్నామని తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం అన్నారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం, రెండు జతల యూనిఫారం లు, పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు అందిస్తున్నామని ఆయన తెలియజేశారు.