విద్యార్థినీ విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండడంతో పాటు సమాజం నుండి మాదకద్రవ్యాల నిర్మూలనకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరూ కృషి చేయాలని కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో యాంటీ నార్కోటిక్ బ్యూరో రూపొందించిన గోడ ప్రతుల్ని ఆవిష్కరించి మాట్లాడారు. డ్రగ్స్ వినియోగంతో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టం జరుగుతుందని తెలిపారు.