కేరళలోని త్రిసూర్ లో గత నెల 31 నుంచి ఈ నెల మూడు వరకు నిర్వహించిన సీనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారుడు సత్తా చాటాడు. సునీల్ రెడ్డి 800 మీటర్లు, 5000 మీటర్ల పరుగు పందెంలలో వెండి పతకాలను సాధించాడని మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజిత్ మోహన్, నరేష్ లు మంగళవారం తెలిపారు.