కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బంజేపల్లి తండాకు చెందిన అజ్మీర అశుతోష్ నీట్-2025 ఫలితాల్లో ప్రతిభ చాటాడు. ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా 32వ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 5,000వ ర్యాంకు సాధించాడు. అశుతోష్ తన పదో తరగతి, ఇంటర్ విద్యను కామారెడ్డిలోనే పూర్తి చేశాడు. ఈ సందర్భంగా జిల్లా లంబాడ హక్కుల పోరాట సమితి, బంజారా సేవా సంఘ నాయకులు ఆయనను అభినందించారు.