టీఎన్జీవో భవన్ కామారెడ్డిలో ఎంపికైన నూతన పాలకవర్గం అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి, కార్యదర్శి ముల్క నాగరాజు, సహాయ అధ్యక్షులు చక్రధర్, ఉపాధ్యక్షులు సాయిలు, కోశాధికారి దేవరాజుకి వారి మిత్ర బృందం అభినందనలు తెలిపారు. వారికి గురువారం గురు రాఘవేంద్ర కాలనీలోని కోశాధికారి ఇంట్లో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.