గత కొన్ని రోజుల కిందట సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మేరకు పోలీసులు సిఈఐఆర్ ద్వారా ట్రేస్ చేసి 13 మందికి ఒకేసారి వారి యొక్క సెల్ ఫోన్ లను గురువారం రోజు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి అప్పగించడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.