కామారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాలలో వదిలివేయబడ్డ లేదా పట్టుబడిన వాహనాలను చట్టపరమైన ప్రక్రియలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వేలం వేయడం జరుగుతుంది. ప్రస్తుతం 217 వాహనాలు కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో భద్రపరచబడ్డాయి. వాహన యజమానులు సరైన ధ్రువపత్రాలతో పోలీస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారి ఏ. నవీన్ కుమార్ (8712525970, 8712686111) ను సంప్రదించి, ధ్రువపత్రాలను చూపించి వాహనాన్ని తీసుకువెళ్లగలరు అన్నారు. యజమానులు వాహనాన్ని తిరిగి పొందేందుకు 6 నెలల గడువు కలదు.