కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్నం సోలార్ ఫిల్టర్ల సహాయంతో సూర్యున్ని వీక్షించారు. రాత్రి 7: 00 నుంచి 10: 00 గంటల వరకు ఆకాశంలో శుక్ర గ్రహం, అంగారక గ్రహాం, బృహస్పతి గ్రహాలను, చంద్రుని వలయాలను చూడడం జరిగిందని అంతరిక్ష వీక్షణ నిర్వాహకులు, పాఠశాల భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ తెలిపారు.