ఖరీఫ్ సీజన్ లో జిల్లాలో 95, 423 ఎకరాల్లో సన్న రకం వరి సాగైందని కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ద్వారా 12, 224 మంది రైతుల నుంచి 84, 109. 32 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేశామని పేర్కొన్నారు. 8, 920 రైతులకు సంబంధించి రూ. 30. 20 కోట్లను బోనస్ గా చెల్లించామని తెలిపారు.