కామారెడ్డి పట్టణంలోని విశ్వ భారతి పాఠశాలలో శుక్రవారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. పాఠశాల కరస్పాండెంట్ అబ్దుల్ సలాం సావిత్రిబాయి పూలే గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.