కామారెడ్డి: మైనార్టీ జూనియర్ కళాశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
కామారెడ్డి పట్టణంలోని మైనార్టీ జూనియర్ కళాశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఇంతియాజ్ అలీ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి, ఆమె గొప్పదనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. కళాశాలలో మహిళా అధ్యాపకురాలు షహనా బేగంను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.