కామారెడ్డి: ఆర్కే విద్యా సంస్థలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

55చూసినవారు
కామారెడ్డి: ఆర్కే విద్యా సంస్థలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
కామారెడ్డి పట్టణంలోని ఆర్కే విద్యా సంస్థలలో ఆర్కే, ఎస్సార్కే, వీఆర్కే జూనియర్, డిగ్రీ & పీజీ కళాశాలలో శుక్రవారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళా అధ్యాపకులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. సీఈఓ జైపాల్ రెడ్డి, ప్రిన్సిపల్స్ అమృత దత్తాత్రి, సైదయ్య, నవీన్ కుమార్, గోవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్