కామారెడ్డి: రక్తదానానికి యువత ముందుకు రావాలి

82చూసినవారు
కామారెడ్డి: రక్తదానానికి యువత ముందుకు రావాలి
కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రక్తహీనతతో చికిత్స పొందుతున్న మహిళకు అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో బుధవారం జిల్లా రక్తదాతల సమితిని సంప్రదించారు. కామారెడ్డికి చెందిన ప్రవీణ్ కుమార్ విషయం తెలుసుకొని రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసిన ప్రవీణ్ కుమార్ ను జిల్లా రక్తదాత సేవా సమితి ప్రతినిధులు బొనగిరి శివ, శ్రీధర్ అభినందించారు. ఆపదలో యువత ముందుకు రావాలన్నారు.

సంబంధిత పోస్ట్