కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా కంచర్ల లింగం బుధవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ ఈ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం కంచర్ల లింగం మాట్లాడుతూ.. 52 యూనియన్ ల సంగమం అయిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గా అందరికి బెన్యాయం జరిగేలా పని చేస్తా అన్నారు. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.