తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మహిళలకు హామీ ఇచ్చిన విధంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకం అమలు చేసి ఆర్టీసి బస్సుల్లో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణంపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావని వాటిని వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ మహిళలను కించపరుస్తూ బస్సులలో బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోండని మహిళల పట్ల కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.