భిక్కనూరు మండలం రామేశ్వరపల్లి సహకార సంఘం ద్వారా రైతులకు గురువారం కొత్త రుణాలు అందజేయడం జరిగిందని సొసైటీ అధ్యక్షులు భూంరెడ్డి తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సొసైటీ ద్వారా 29 మంది రైతులకు 20 లక్షల 80 వేల రూపాయలు చెక్కుల రూపంలో అందచేయడం జరిగిందన్నారు. సొసైటీలో ఇప్పటి వరకు మాఫీ అయిన రైతులకు తిరిగి కొత్త రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. సొసైటీ సీఈఓ శంకర్, రైతులు ఉన్నారు.