కామారెడ్డి జిల్లా కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో ఓ యాక్సిడెంట్ కేసు పరిష్కారమైంది. తాడ్వాయిలో జరిగిన ప్రమాదంలో ఓ ఉద్యోగి మరణించారు. అతని తరపు న్యాయవాది శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి 2కోట్ల పరిహారం కోరారు. ఈ కేసు లోక్ ఆదాలత్లో ఇరువర్గాల ఒప్పందంతో 1. 40లక్షలకు రాజీ కాగా, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జిల్లా న్యాయమూర్తి కేసును పరిష్కరించి, రాజీయే రాజమర్గం అన్నారు.