ఈ నెల 28న నిర్వహించే లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధుశర్మ అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ, లోక్ అదాలత్ లో సమస్యను సత్వరంగా పరిష్కరించుకోవచ్చు అన్నారు. కక్షిదారులు రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్, సివిల్, చిన్న చిన్న కుటుంబ కలహాలు, సరిహద్దు వివాదాలు, వివాహ కుటుంబ తగాదాలు, రోడ్డు ప్రమాదాలు ఇతర కేసులపై లోక్ అదాలత్ వేదిక ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.