కామారెడ్డి జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ఇన్స్పెక్టర్ నరహరి, పోలీస్ సిబ్బంది పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా, పోలీస్ స్టేషన్ ఎదుట, రైల్వే స్టేషన్ ఏరియాల్లో ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నెంబర్ ప్లేట్ వాహనాలను, మద్యం సేవించి వాహనాలను నడిపిస్తున్న వారి మీద పది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, లక్ష ముప్పై వేల జరిమానాలు విధించారు.