దోమకొండ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం కామారెడ్డి ఎమ్మెల్యే కెవిఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేశారు. దోమకొండ మండలంలోని పలు గ్రామాల కు చెందిన 25 మంది బాధితులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎండిఓ ప్రవీణ్ కుమార్, బిజెపి మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, తిప్పాపురం రవి, నరేందర్ రెడ్డి, బండి స్వామి, కంది మనోజ్, చిట్యాల రవి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.