దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

70చూసినవారు
దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలో నిర్మించిన సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని శుక్రవారం కామారెడ్డి ఎమ్మెల్యే కెవిఆర్ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, సాయిధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ఉన్న కురుమ కులస్తులందరూ ఐక్యంగా ఉండి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని చెప్పారు. నాయకులు భూపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రవి, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్