కామారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికలు మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలి

85చూసినవారు
కామారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికలు మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలి
మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల దృష్ట్యా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో పీఓ, ఏపీఓ, ఓపిఓ లకు మొదటి దఫా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను పకడ్బందీగా, ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్