కామారెడ్డి: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: డీటీఓ

64చూసినవారు
కామారెడ్డి: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: డీటీఓ
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోడ్డుభద్రత మాసోత్సవాల సందర్భంగా బాన్సువాడ, కామారెడ్డి పట్టణాల్లో పలు వాహనాలకు రోడ్డు భద్రతపై నిబంధనలకు సంబంధించిన పోస్టర్లను అతికించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారి శ్రీనివాస్, నాగలక్ష్మి, సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారి భిక్షపతి, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్