నర్సరీని పరిశీలించిన ఎంపీడీవో

52చూసినవారు
నర్సరీని పరిశీలించిన ఎంపీడీవో
పిట్లం గ్రామ పంచాయతీ పరిధిలోని హరితహారం నర్సరీని బుధవారం ఎంపీడీవో కమలాకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులతో మాట్లాడుతూ, మొక్కల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఎండలు బాగా ఉన్న నేపథ్యంలో మొక్కలకు రెండు పూటలా నీటిని పట్టించాలని సూచించారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల సూచనలు పాటించి ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత నిర్వాహకులపై ఉందని తెలిపారు. ఆయన వెంట ఏపీవో శివకుమార్, సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్